ISRO: ఇస్రోకు రెండో ప్రయోగ కేంద్రం
రెండో ప్రయోగ కేంద్రంగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టిణంలో ఇస్రో తలపెట్టిన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు రాష్ట్రానికి వచ్చిన ఆయన ఫిబ్రవరి 27న తూత్తుకుడి, తిరునెల్వేలిలో పర్యటించారు. కులశేఖరపట్టిణం నుంచి ఇస్రో మొదటి సారిగా రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. రోహిణి–200 సౌండింగ్ రాకెట్ ను ఫిబ్రవరి 28న మధ్యాహ్నం శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags