Lander Vikram Reactivation Postponed: ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ల పునరుద్ధర‌ణ వాయిదా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లను పునరుద్ధరించే ప్రణాళికను శనివారానికి వాయిదా వేసింది.
Lander Vikram Reactivation Postponed

స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ మాట్లాడుతూ, "ఇంతకుముందు మేము సెప్టెంబర్ 22 సాయంత్రం ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌ను నిద్రావ‌స్థ నుంచి తిరిగి ప‌ని చేయించాల‌నుకున్నాము, అయితే కొన్ని కారణాల వల్ల దీనిని సెప్టెంబర్ 23న చేస్తామని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రోవర్‌ను, ల్యాండర్‌ను మళ్లీ యాక్టివేట్ చేయాలనేది మా ప్రణాళిక అని దేశాయ్ తెలిపారు. రోవర్‌ను దాదాపు 300-350 మీటర్లు తరలించాలని మేము ప్రణాళిక రూపొందించాము. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. రోవర్ ఇప్పటి వరకు చంద్రునిపై 105 మీటర్ల ప్ర‌యాణం సాగించిందని దేశాయ్ తెలిపారు. 

Vikram Lander wake up: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు!

#Tags