Venus Orbiter Mission: అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన భారత్‌!

భారతదేశం తన అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసింది.

చంద్రుడు, అంగారక గ్రహాల తర్వాత, ఇప్పుడు శుక్ర గ్రహంపై తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వీనస్ ఆర్బిటర్ మిషన్(VOM)కు ఆమోదం తెలిపారు. ఈ మిషన్‌ను అనధికారికంగా శుక్రయాన్ అని కూడా అంటారు. 

వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ద్వారా చేపట్టబడుతున్న అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్.

వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటే ఏమిటి?
ఉద్దేశ్యం: ఈ మిషన్‌ యొక్క ప్రధాన లక్ష్యం శుక్ర గ్రహం యొక్క ఉపరితలం, వాతావరణాన్ని అధ్యయనం చేయడం.
అధ్యయనం చేయబడే అంశాలు: శుక్ర గ్రహం యొక్క ఉపరితలం, ఉపరితలం క్రింద ఉన్న భాగాలు, వాతావరణ ప్రక్రియలు, సూర్యుడి ప్రభావం వంటి అంశాలను వివరంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.
ఇస్ట్రో యొక్క పాత్ర: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ మిషన్‌ను నిర్వహించనుంది.
అంతరిక్ష విభాగం: ఈ మిషన్‌ను అంతరిక్ష విభాగం ద్వారా అమలు చేయబడుతుంది.

Chandrayaan 4: అంతరిక్షంలో భారత్‌ జైత్రయాత్ర.. రూ.2 వేల‌ కోట్లకు పైగా ఖర్చు

#Tags