Gaganyaan: 'గగన్‌యాన్' ప్రాజెక్టుకు పదేళ్లు!
సతీశ్ థవన్ స్పేస్ సెంటర్‌లోని 2వ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో ఉదయం 8.45 గంటలకు రాకెట్‌కు సంబంధించిన ఎస్-200 మోటార్ సెగ్మెంట్‌ను శాస్త్రవేత్తలు అనుసందానం చేశారు.
ఈ రాకెట్ మూడు దశల్లో పనిచేసి, 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని పొడవు 53 మీటర్లు, బరువు 640 టన్నులు. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి, తిరిగి భూమిపై సురక్షితంగా తీసుకురావడం లక్ష్యం.
గగన్‌యాన్ ప్రాజెక్టుకు పదేళ్లు
గగన్‌యాన్ కోసం పదేళ్ల కిందట 2014 డిసెంబర్ 18న 3,775 కిలోల బరువు కలిగిన క్రూ మాడ్యూల్‌ను ఎల్‌వీఎం3-ఎక్స్ కేర్ మిషన్ అనే రాకెట్ ద్వారా షార్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించగా.. పదేళ్ల తర్వాత మళ్లీ అదే రోజున ఇస్రో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగు వేసింది.
గగనా యాన్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు పదేళ్లుగా ఎన్నో పరీక్షలు నిర్వహించిన ఇస్రో.. ఇప్పుడు హెచ్ఎల్‌వీఎం8-జీ1 పేరుతో మొదటి ప్రయోగానికి సిద్ధమవుతోంది.
అప్పట్లో ఎల్‌వీఎం3-ఎక్స్ కేర్ మిషన్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్.సోమనాథ్.. ఇప్పుడు ఇస్రో చైర్మన్ హోదాలో ఉన్నారు.