Indian Navy: 23 మంది పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ

అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన చేపల బోటులో ఉన్న 23 మంది పాకిస్థానీయులను భారత నేవీ కాపాడింది.

సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు భారీ నేవీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడిఉన్నట్లు నేవీ ప్రకటించింది.

వివరాల ప్రకారం.. ఇతర దేశాల నౌకలు ఆపదలో ఉన్న ప్రతీసారి మేము ఉన్నామంటూ భారత నేవీ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే నేవీ అధికారులు మరో సహాసం చేశారు. అరేబియాలోని గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్‌ మైళ్ల దూరంలో మార్చి 28వ తేదీ ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్‌ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. 

Indian Navy: నావికా దళంలోకి రెండు యుద్ధ నౌకలు

దీంతో, ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్లు భారత నేవీ మార్చి 29వ తేదీ ప్రకటించింది. దీంతో తొలుత ఐఎన్‌ఎస్‌ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్‌’ బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ నౌక దానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థానీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది. ఇక, రక్షించిన బోటును సురక్షిత రక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత్‌ నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

#Tags