Glide Bomb: గ్లైడ్ బాంబ్ ‘గౌరవ్‌’ తొలి ప్ర‌యోగం స‌క్సెస్‌

సుఖోయ్‌-30 (Su-30 MKI) యుద్ధ విమానం నుంచి భార‌త్ మొట్టమొద‌టిసారిగా ప్ర‌యోగించిన లాంగ్‌రేంజ్ గ్లైడ్ బాంబ్‌(ఎల్ఆర్‌జీబీ) ‘గౌరవ్‌’ ప‌రీక్ష విజ‌య‌వంతమైంది.

సుదూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన ఈ బాంబును డీఆర్‌డీవో తొలిసారి ఓ యుద్ధ విమానం నుంచి ఆగ‌స్టు 14వ తేదీ ప్రయోగించింది.

ఒడిశా తీరంలోని లాంగ్ వీల‌ర్ ద్వీపంపైన ఏర్పాటు చేసిన ల‌క్ష్యాన్ని గ్లైడ్ బాంబ్ అత్యంత క‌చ్చిత‌త్వంతో ఛేదించింద‌ని ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. బాంబ్‌ను విడిచిపెట్టాక అది హైబ్రిడ్ నేవిగేష‌న్ వ్య‌వ‌స్థ ద్వారా ల‌క్ష్యం వైపుగా సాడింద‌ని వివ‌రించింది. సుమారు 1,000 కిలోల బ‌రువుండే గౌర‌వ్‌కు దూర ప్రాంతంలోని ల‌క్ష్యాల‌ను ఛేదించే స‌త్తా ఉంద‌ని పేర్కొంది.

దీనిని హైద‌రాబాద్‌లోని ఆర్‌సీఐ(రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌)లో రూపొందించి, అభివృద్ధి చేసింది. ఏ ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతం చేసిన వైమానిక ద‌ళం, డీఆర్‌డీవో, ఇతర ప‌రిశ్ర‌మ‌ల అధికారుల‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంసించారు.

గ్లైడ్‌ బాంబులను యుద్ధ విమానాల నుంచి ప్రయోగిస్తుంటారు. నిర్ధిష్ట లక్ష్యానికి కొంత దూరం నుంచి గ్లైడ్‌ బాంబులను యుద్ధ విమానాలు జార విడుస్తాయి. అనంతరం జీపీఎస్‌ లేదా ఆ తరహా సాంకేతికతతో ఈ బాంబులు నిర్దేశిత లక్ష్యాలను కొడతాయి.

Earth Mantle: తొలిసారి చేజిక్కిన భూ ప్రవార శిల.. భూమి రెండో పొర నుంచి రాళ్ల నమూనా!

#Tags