Devika AI: ఇండియన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘దేవిక’

ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ‘డెవిన్‌’కు పోటీగా భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వీహెచ్‌ ముఫీద్‌æఓపెన్‌ సోర్స్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ‘దేవిక’ను రూపొందించారు. ‘ఇదొక ఏజెంటిక్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మనుషులు అందించే హైలెవెల్‌  సూచనలను అర్థం చేసుకోగలదు. వాటిని వివిధ భాగాలుగా విభజించి, అవసరమైన సమాచారాన్ని శోధించి.. ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా కోడ్‌ను రాయగలదు’ అని ముఫీద్‌ వివరించారు. అమెరికా స్టార్టప్‌ కంపెనీ ‘కాగ్నిషన్‌ ఏఐ’ గత నెలలో ‘డెవిన్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. సంక్లిష్టమైన ఇంజనీరింగ్‌ టాస్క్‌లను పూర్తిచేయటం దీని ప్రత్యేకత. అత్యంత పాపులర్‌ అయిన ‘డెవిన్‌’కు పోటీగా ‘దేవిక’ను నిలబెట్టడమే తన ఉద్దేశమని ముఫీద్‌ చెప్పారు. యూజర్ల ప్రమేయం లేకుండా కంప్యూటర్‌ కోడ్‌లో లోపాల్ని ఇది సరిచేస్తుందని తెలిపారు.

చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags