Green Energy: ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ’కి.. 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ!

గ్రీన్‌ ఎనర్జీ(Green Energy) ఉత్పాదకతను ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి త్వరలో ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ(Green Energy Policy)’ ప్రకటించబోతున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో ఎంఓయూ పత్రాలతో సింగరేణి సీఎండీ బలరాంనాయక్, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి

కాలుష్య కారక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత గ్రీన్‌ ఎనర్జీ(Green Energy) ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోందని చెప్పారు. రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ(Green Energy) ఉత్పత్తితో దేశంలో ముందంజలో ఉండగా, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచడమే పాలసీ లక్ష్యమన్నారు. జ‌న‌వ‌రి 3వ తేదీ హెచ్‌ఐసీసీలో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల భాగస్వాములతో నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడారు. అనంతరం వివరాలను వెల్లడించారు. 

భారీగా పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌ 
‘సాంకేతిక, ఫార్మా, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల అభివృద్ధికి రాష్ట్రం కేంద్రంగా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు అధిక విద్యుత్‌ డిమాండ్‌(Electricity Demand) కు దోహదపడతాయి. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడగా, 2029–30 నాటికి 24,215 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా’ అని భట్టి చెప్పారు.  

Hyderabad Book Fair: 37వ జాతీయ బుక్‌ఫెయిర్‌ ప్రారంభం.. పుస్తక ప్రదర్శన ఈ స‌మ‌యంలోనే..

భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు 
‘పునరుత్పాదక విద్యుత్‌ రంగం(Electricity Sector)లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 7,889 మెగావాట్ల సౌర విద్యుత్, 2,518 మెగావాట్ల జల విద్యుత్, 771 మెగావాట్ల డిస్ట్రిబ్యూటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ, 128 మెగావాట్ల పవన విద్యుత్‌ సహా 221 మెగావాట్ల ఇతర పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. పాలసీలో భాగంగా సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్‌ సోలార్, గ్రీన్‌ హైడ్రోజన్, హైబ్రిడ్‌ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తాం..’ అని భట్టి తెలిపారు. 

భవిష్యత్తు ఇందనంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీ 
గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని భట్టి చెప్పారు. ఆ్రస్టేలియా– ఇండియా క్రిటికల్‌ మినరల్‌ రీసెర్చ్‌ హబ్‌ ఆధ్వర్యంలో జ‌న‌వ‌రి 3వ తేదీ హైదరాబాద్‌ ఐఐటీలో రెండురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పరిశోధన, సంబంధిత సైన్స్‌ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్‌ నాయకత్వంలోనే హైదరాబాద్‌ ఐఐటీకి పునాదులు పడ్డాయని, ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదికలని చెప్పారు.

ఈ సందర్భంగా.. సింగరేణిలో పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుపై హైదరాబాద్‌ ఐఐటీ ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సింగరేణి డైరెక్టర్‌ బలరామ్‌ నాయక్, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి ఎంఓయూపై సంతకాలు చేశారు. 

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్‌ రెడ్డి

#Tags