Telangana Caste Census: నవంబర్ 6 నుంచి తెలంగాణలో కుల గణన

తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం న‌వంబ‌ర్ 6వ తేదీ నుంచి కుల గణన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన కార్యక్రమం నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

కుల గణన నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణనలో 36,549 మంది ఎస్‌జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్లు పాల్గొనేలా ప్లాన్‌ చేసింది. 6,256 మంది ఎంఆర్‌సీలు, రెండు వేల మంది మినిస్టీరియల్‌ సిబ్బంది కూడా కుల గణనలో ఉంటారని స్పష్టం చేసింది. 

అలాగే.. కుల గణన నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, 6వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా కుల గణన కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Musi River: ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో ఉన్న‌ మూసీ

#Tags