India Today Education Summit 2024: తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న‌ సీఎం జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ‌న‌వ‌రి 24వ తేదీ తిరుపతిలో జరిగిన‌ ఇండియా టుడే విద్యా సదస్సులో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా విద్యా సంస్కరణలు, ప్రాధాన్యతలపై సీఎం జగన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ మ‌ద్య జ‌రిగిన చర్చలు ఇవే..  

సీఎం జగన్‌ : 
➤ ఒక ఆలోచనకు ప్రయత్నం జోడిస్తున్నాం.
➤ IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి.
➤ IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం.
➤ ఇందుకు వారిని అభినందిస్తున్నాను.
➤ ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది.
➤ ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది.
➤ 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు.
ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం.

రాజ్‌దీప్‌ :
➤ అది గొప్ప దార్శనికతే.
➤ గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే.
➤ కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా?

సీఎం జగన్‌ :
➤ ఐబీ సిలబస్‌ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డుతో చేతులు కలిపింది.
➤ IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం.
➤ జూన్‌ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్‌ ప్రవేశపెడతాం.
➤ అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం.
➤ ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్‌ సర్టిఫెకెట్‌ కోసం పోటీ పడతారు.
➤ ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం.
అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా..
➤ ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు,
అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి

రాజ్‌దీప్‌ :
➤ ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు,
➤ మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా?
➤ IB సిలబస్‌ కూడా ప్రవేశపెట్టారా?
➤ అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.?
➤ అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..
➤ తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.?

సీఎం జగన్‌ :
➤ 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి.
➤ డిసెంబర్‌ 21న టాబ్‌లు ఇచ్చాం.
➤ నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్‌ అందజేస్తాం.

రాజ్‌దీప్‌ :
➤ 8వ తరగతి విద్యార్థికి టాబ్‌ ఇచ్చారా?
➤ కోవిడ్‌ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు?
➤ ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.?
➤ వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్‌లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా?

సీఎం జగన్‌ :
➤ ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
➤ పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్‌ పెట్టాం.
➤ మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్‌ అంశాలను చేర్చాం.
➤ పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. 
➤ ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం.
➤ నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం.
➤ 62 వేల తరగతి గదులుంటే.. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ టీవీలు ఏర్పాటు చేశాం.
➤ ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి.
➤ టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం.
➤ 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్‌ నేర్చుకునేందుకు అందించాం.

రాజ్‌దీప్‌ :
➤ అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? 

సీఎం జగన్‌ :
➤ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు?
నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి 

రాజ్‌దీప్‌ :
➤ మూడో తరగతి నుంచే గ్లోబల్‌ ఎగ్జామ్‌ టోఫెల్‌ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి.
➤ తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.?

సీఎం జగన్‌ :
➤ ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం
➤ పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం
➤ నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి
➤ పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి
పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు

రాజ్‌దీప్‌ :
➤ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం,
➤ చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు,
➤ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది.
➤ ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీని పర్యటించడం గొప్ప విషయం

#Tags