Telangana Rains: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షపాతం నమోదు... 24 గంటల్లో 64 సెం.మీల వ‌ర్షం... ఎక్క‌డంటే

తెలంగాణ‌: తెలంగాణ త‌డిసిముద్ద‌వుతోంది. నాలుగైదు రోజులుగా ఎడితెరిపి లేకుండా జోరుగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో రోడ్ల‌న్నీ చెరువుల‌ను త‌లపిస్తున్నాయి. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలోకి వ‌ర‌ద నీరు రావ‌డంతో ప‌ట్ట‌ణంలోని చాలా కాల‌నీలు జ‌ల దిగ్భంద‌నంలో చిక్కుకున్నాయి.
తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షపాతం నమోదు... 24 గంటల్లో 64 సెం.మీల వ‌ర్షం... ఎక్క‌డంటే

అయితే తెలంగాణ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదుకాని వ‌ర్ష‌పాతం ఈ కొద్దిరోజుల్లోనే న‌మోదైంది. ఇప్ప‌టివ‌ర‌కు వాజేడులో కురిసిన వ‌ర్ష‌పాత‌మే అత్య‌ధికంగా ఉండేది. ప్ర‌స్తుత వ‌ర్షాలు ఈ రికార్డును తుడిచేశాయి. ఆ వివ‌రాలేంటో ఇక్క‌డ తెలుసుకుందాం. 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. ఇప్పటివరకు 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతమే (51 సెం.మీ.) అత్యధికం. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ., 200 కేంద్రాల్లో 10 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావ‌ర‌ణ శాఖాధికారులు తెలిపారు.

#Tags