Central Tobacco Research Institute: కొత్త పొగాకు వంగడాల విడుదల

కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌–సీటీఆర్‌ఐ) ద్వా­రా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాల­కు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయ‌ని తూర్పు గోదావరి జిల్లా రాజ­మ­హేం­ద్రవరం సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ డా.మాగంటి శేషుమాధవ్‌ గురువారం తెలిపారు.
Tobacco

ఎఫ్‌సీఆర్‌–15 (సీటీఆర్‌ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేల­లకు అనువైనదన్నారు. ఇది అధిక దిగు­బడి­ని (హెక్టార్‌కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్‌ పొగా­కు రకమన్నారు.
ఎఫ్‌సీజే–11 (సీటీఆర్‌ఐ నవీన­) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడి­నిచ్చే (హెక్టార్‌కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామ­ర్థ్యం కలిగిన బ్యారన్‌ పొగాకు రక­మన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబ­డినిచ్చే (హెక్టార్‌కు 2,900 కిలో­లు), శీతా­ఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్‌ వెరైటీ రిలీజ్‌ కమిటీ (ఎస్‌వీఆర్‌సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్‌లో సీటీఆర్‌ఐలో లభ్యమవుతు­న్నాయని చెప్పారు. 

☛☛ New seeds developed by NG Ranga Agriculture: ఏపీ మార్కెట్‌లోకి కొత్త విత్తనాలు

#Tags