Jagananna Thodu Scheme: ‘జగనన్న తోడు’ ప‌థ‌కం పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ‌రో ప‌థ‌కం పేరును మార్చింది.

ఏపీలో చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు పెట్టింది. జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ సెప్టెంబ‌ర్ 30వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది.

గత వైఎస్‌ జ‌గ‌న్‌ ప్రభుత్వం చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారుల కోసం 'జగనన్న తోడు' పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా వడ్డీలేని రూ.10 వేల రుణం అందించారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో అనేక పేర్లు మార్చింది. 

AP Schemes Name Changed: ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు.. మారిన పథకాల పేర్లు ఇవే..

#Tags