Telangana Governor: సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌ బాధ్యతలు, ఈయన ఎవరంటే..

Telangana Governor

సాక్షి, హైదరాబాద్‌: తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు.

తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్‌ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం.

#Tags