Zakir Hussain Death: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ (73) కన్నుమూశారు.

గుండె, ర‌క్త‌పోటు స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న జాకీర్ హుస్సేన్ అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో మరణించిన‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
జాకీర్ హుస్సేన్ గురించి ఆసక్తికరమైన విషయాలు

  • 1951 మార్చి 9వ తేదీ ముంబైలో జన్మించిన ఆయన అసలు పేరు జాకీర్‌ హుస్సేన్‌ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ మూడు సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించారు. ఆపై ఏడేళ్ల వయస్సులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు.
     
  • ఆయన కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు.

Terry Griffiths: స్నూకర్‌ దిగ్గజం గ్రిఫిత్‌ కన్నుమూత

  • సంగీతంలో రాణించడంతో పాటు, అతను ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.
  • జాకీర్ హుస్సేన్ మిక్కీ హార్ట్‌తో కలిసి "ప్లానెట్ డ్రమ్" ఆల్బమ్‌లో తన సహకారానికి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన కొద్దిమంది భారతీయ సంగీతకారులలో ఒకరిగా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.
     
  • భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా.. జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్‌లాఫ్లిన్ (శక్తి),  యో-యో మా వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి.. తూర్పు. పాశ్చాత్య సంగీత సంప్రదాయాల మధ్య అంతరాన్ని తగ్గించారు.
  • జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో వర్క్‌షాప్‌ల ద్వారా తదుపరి తరం తబలా ప్లేయర్‌లను పెంపొందించడంలో తనవంతుగా పనిచేశారు.
     
  • అతను భారతదేశంలో 'నేషనల్ ట్రెజర్' బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
     
  • 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.

Movva Rama Rao: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వా మృతి

  • ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో  66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకుని రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.

#Tags