Supreme Court CJ's: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ భూయాన్, జస్టిస్‌ ఎస్‌వీ భట్టి

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్,కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Supreme Court CJ's

సుప్రీంకోర్టులో మూడు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సి ఉండడంతో కొలీజియం ఇటీవల సమావేశమైంది. కేరళ సీజే ఎస్‌.వెంకటనారాయణ భట్టి, తెలంగాణ సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్లను కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది.
హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా సీనియారిటీ, మెరిట్, పనితీరు వంటి అంశాలతోపాటు హైకోర్టుల ప్రాతినిధ్యం, అట్టడుగు వర్గాలు, సమాజంలో వెనకబడిన వర్గాలు, లింగ వైవిధ్యం, మైనారిటీల ప్రాతినిధ్యం వంటివి మూల్యాంకనం చేసి ఈ ఇద్దరు న్యాయమూర్తులను సిఫార్సు చేసినట్లు పేర్కొంది.

 Daily Current Affairs in Telugu: 6 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

సమగ్రత, సామర్థ్యం ఉన్న న్యాయమూర్తి భుయాన్‌:

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ చట్టంలోని విభిన్న అంశాలపై అనుభవం సంపాదించారని సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. లా ఆఫ్‌ టాక్సేషన్‌లో ఆయన ఎంతో నైపుణ్యం ఉన్నవారని తెలిపింది. బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ట్యాక్సేషన్‌ సహా పలు కేసులు సమర్థంగా డీల్‌ చేసిన ఆయన సమగ్రత, సామర్థ్యం ఉన్న న్యాయమూర్తి అని పేర్కొంది. 

జస్టిస్‌ భట్టి అనుభవం అపారం:

ఏపీ, కేరళ హైకోర్టుల్లో సుదీర్ఘకాలం పనిచేసిన జస్టిస్‌ భట్టి చట్టంలోని పలు అంశాలపై అపార అనుభవం సంపాదించారని సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. జస్టిస్‌ భట్టి తీర్పులే ఆయన న్యాయపరమైన యోగ్యతకు నిదర్శనమని తెలిపింది. జస్టిస్‌ భట్టి జ్ఞానం, అనుభవం సుప్రీంకోర్టుకు అదనపు విలువ అందిస్తాయని పేర్కొంది. 

 Adilabad district Geographic features: ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..

 


 

#Tags