Sunil Bharti Mittal: ఎయిటెల్‌ బాస్‌ సునీల్‌ మిట్టల్‌కు నైట్ హుడ్‌ అవార్డ్‌!

భారతీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్‌ కమాండర్‌ పురస్కారంతో సత్కరించింది.

ఎలిజబెత్‌ రాణి మరణం తర్వాత బ్రిటన్‌ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్‌–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్‌ మిట్టల్‌ రికార్డు సృష్టించారు. 

బ్రిటన్, భారత్‌ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్‌(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్‌ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్‌ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్‌ కమాండర్‌ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు.

Gaganyaan 4 Astronauts Details: గగన్‌యాన్‌ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్ల‌నున్న న‌లుగురు వీరే..

#Tags