Sudha Murthy: రాజ్యసభకు సుధామూర్తి.. ఆమె తీసుకున్న అవార్డులు ఇవే..

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి (73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 8, 2024న ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. ఈ నామినేష‌న్ ఆమె సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

➢ 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జన్మించారు.
➢ హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో ➢ బీఈ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు.
➢ టాటా ఇంజినీరింగ్‌ లోకోమోటివ్‌ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరి, దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు.
➢ 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది.
➢ 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్‌ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు.
➢ 1996లో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
➢ కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో పలు పుస్తకాలు రాశారు.
➢ వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు, పాఠశాలల్లో 70 వేల గ్రంథాలయాలు నిర్మించారు.

Srinivasan K.Swamy: ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఈయ‌నే..

ఆమె తీసుకున్న అవార్డులు ఇవే..
➢ భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డు
➢ కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు
➢ సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ.. ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు
➢ 2023లో గ్లోబల్‌ ఇండియన్‌ అవార్డు
➢ నాన్‌ఫిక్షన్‌ విభాగంలో క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డు
➢ ఐఐటీ–కాన్పూర్‌ నుంచి గౌరవ డాక్టరేట్

Grammy Awards 2024: ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు అందుకున్న భారతీయులు వీరే..

#Tags