Miss Universe: అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్న‌ సౌదీ సుందరి

ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుండి ఒక యువతి మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది.

27 ఏళ్ల రూబీ అల్ఖాతానీ అనే మోడల్ త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరఫున పాల్గొనబోతోంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి.

అందాల పోటీల అనుభవం
రూబీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. మిస్ సౌదీ అరేబియా కిరీటంతో పాటు మిస్ మిడిల్ ఈస్ట్ (సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్-2021, మిస్ ఉమెన్ (సౌదీ అరేబియా) టైటిళ్లను కూడా గెలుచుకుంది.

ప్రపంచానికి సౌదీ సంస్కృతిని పరిచయం చేయాలని లక్ష్యం
"ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తాను" అని రూబీ అరబ్ న్యూస్ తో చెప్పింది.

సౌదీలో సంస్కరణలు
కఠిన ఆంక్షలతో పేరుగాంచిన సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవలి కాలంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మహిళలకు డ్రైవింగ్, పురుషుల పార్టీలకు హాజరు కావడం, పురుష సంరక్షకులు లేకుండా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవడం వంటి హక్కులు కల్పించారు.

IBA Chairman: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్‌గా ఎంవీ రావు..

#Tags