New Chief Secretary: కేరళ చీఫ్‌ సెక్రటరీగా శారదా మురళీధరన్

దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చరిత్రాత్మకమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ భర్త తర్వాత భార్య ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కేరళ..
➣ శారదా మురళీధరన్ అనే మహిళా ఐఏఎస్ అధికారిణి కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆగ‌స్టు 21వ తేదీ నియమితులయ్యారు. 
➣ ఆమె త‌న భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
➣ ఈ మార్పు ఆగస్టు 31వ తేదీన వేణు పదవీ విరమణ చేయడంతో జరుగుతుంది.
➣ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

DG of Army Medical Services : ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ..

కర్ణాటక..
➣ కర్ణాటకలోనూ ఇదే విధంగా శాలినీ రజనీష్‌ ఆగస్టు 1వ తేదీన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
➣ ఆమె భర్త రజనీష్‌ గోయెల్‌ రిటైరయ్యాక ఆయన స్థానంలో సీఎస్‌ అయ్యారు.

#Tags