Samir V Kamat: డీఆర్‌డీవో చీఫ్‌గా సమీర్‌ వి కామత్‌

ప్రముఖ శాస్త్రవేత్త సమీర్‌ వి కామత్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) చైర్మన్‌ గా నియమితులయ్యారు. అదేవిధంగా ప్రస్తుత డీఆర్‌డీవో చీఫ్‌ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కామత్‌ ప్రస్తుతం డీఆర్‌డీవోలో నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags