Nariman: న్యాయ కోవిదుడు నారిమ‌న్ క‌న్నుమూత‌

ప్రముఖ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్.నారీమన్(95) ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ కన్నుమూశారు.

ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు నారీమన్​ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 
1950లో నారీమన్ బాంబే హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1972లో కేంద్ర ప్రభుత్వం అత‌న్ని అడిషనల్‌ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడంతో తన పదవికి రాజీనామా చేశారు. 

1991 నుంచి 2010 వరకు బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 

Imtiaz Qureshi: మాస్ట‌ర్ చెఫ్, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత ఇంతియాజ్ ఖురేషీ క‌న్నుమూత‌

#Tags