Journalist Vinay Vir: ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ వీర్ కన్నుమూత‌

ప్రముఖ జర్నలిస్ట్, ప్రచురణకర్త, డైలీ హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్ (72) ఏప్రిల్ 27వ తేదీ మరణించారు.

దక్షిణ భారతదేశంలో హిందీ భాషకు ఛాంపియన్‌గా, గౌరవనీయ వ్యక్తిగా గుర్తించబడే ఆయన, హిందీ జర్నలిజాన్ని ప్రోత్సహించడంలో అంకితభావంతో పనిచేశారు.

➤ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుతున్న సమయంలోనే హిందీ భాషాభిమానిగా మారిన వినయ్ వీర్, లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.
➤ తండ్రి యుధ్‌వీర్, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు.
➤ తండ్రి మరణానంతరం యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
➤ ఫొటో జర్నలిస్టుగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.
➤ జూబ్లీహిల్స్‌లోని విస్పర్‌ వ్యాలీలో ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు జరిగాయి.

 

Maria Feliciana: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత.. ఈమె గాయని, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి కూడా..

#Tags