Rachel Gupta: 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్' కిరీటాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ ఈమెనే..

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్ను సాధించి రాచెల్‌ గుప్తా (20) చరిత్ర సృష్టించింది.

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో, రాచెల్ 70కి పైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి, ఈ కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. ఆమె విజయం భారత్‌లో చాలా మంది ప్రజలకు గర్వాన్ని కలిగించింది, ముఖ్యంగా ఆమె కుటుంబం జలంధర్‌లో సంబరాలు చేసుకుంటోంది.

బ్యాంకాక్‌లోని MGI హాల్‌లో, రాచెల్ గ్రాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కు చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ఈ అంతర్జాతీయ పోటీలో ప్రాతినిధ్యం వహించారు. 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకున్న రాచెల్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే రాయబారిగా ఉంటారు.

Rashmika Mandanna: జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక

రాచెల్ టైటిల్‌ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్‌ సృష్టించడమే కాదు.. 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్‌ లారాదత్తా సరసన చేరింది. ఈమె మోడల్, నటి, వ్యాపారిగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్నారు.

#Tags