Pema Khandu: అరుణాచ‌ల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం..

అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భాజపా నేత పెమా ఖండూ వరసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

జూన్ 13వ తేదీ ఈటానగర్‌లోని డీకే స్టేట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కె.టి.పర్నాయక్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మ‌రో 11 మంది మంత్రులుగా  ప్రమాణం చేశారు. వీరిలో 8 మంది కొత్త‌వారు ఉన్నారు. 

36 ఏళ్ల విరామం తర్వాత ఈసారి మహిళా మంత్రికి అవకాశం లభించింది. ఆమె పేరు దొసాంగ్లు పుల్‌. ఆమె మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్‌ సతీమణి. ఆమెను ఉక్కుమహిళగా పిలుస్తుంటారు. 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60 స్థానాలకు గానూ 46 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

Cabinet Ministers: మోదీ 3.0 టీమ్.. కేంద్ర కేబినేట్‌లో 72 మంది మంత్రులు వీరే..

#Tags