Paetongtarn Shinawatra: థాయ్‌లాండ్‌ ప్రధానిగా పేటోంగ్‌టార్న్‌ షినవత్ర..

థాయిలాండ్‌ నూతన ప్రధానిగా పేటోంగ్‌టార్న్‌ షినవత్రగా ఎన్నికవ్వ‌నున్నారు.

థాయిలాండ్‌ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్‌ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్‌టార్న్‌ షినవత్ర పేరును నామినేట్‌ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగ‌స్టు 15వ తేదీ  పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్‌ ప్రకటించింది. 

ఆగ‌స్టు 16వ తేదీ  జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్‌టార్న్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 

థాయిలాండ్‌లో ఈ పదవిని స్వీక‌రించిన అతి పిన్న వయస్కురాలు పేటోంగ్‌టార్న్ అవుతారు. గతంలో పేటోంగ్‌టార్న్‌ తండ్రి తక్షిన్‌ షినవత్ర, మేనత్త ఇంగ్లక్‌ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. ఈమె బావమరిది సోమ్చాయ్ వాంగ్సావత్ 2008లో, ఆమె సోదరి యింగ్లక్ షినవత్రా 2011 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. పేటోంగ్‌టార్న్‌ను ఏకగ్రీవంగా నామినేట్‌ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్‌ థియేన్‌థాంగ్‌ చెప్పారు. 

Srettha Thavisin: థాయ్‌లాండ్‌ ప్రధాని తొలగింపు.. కార‌ణం ఇదే..

#Tags