Frank Duckworth : ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతి సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్‌ డక్‌వర్త్‌ కన్నుమూత..

వర్షం వస్తే క్రికెట్‌ మ్యాచ్‌ల ఫలితాలను నిర్దేశించే ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతి సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్‌ డక్‌వర్త్‌ కన్నుమూశారు. 84 ఏళ్ల డక్‌వర్త్‌ జూన్‌ 21న మరణించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఈ గణాంకవేత్త.. టోనీ లూయిస్‌తో కలిసి రూపొందించిన విధానాన్ని క్రికెట్‌లో 1997 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) అమలు చేస్తోంది. ఆస్ట్రేలియా స్టాటిస్టిషియన్‌ స్టీవెన్‌ స్టెర్న్‌ సూచించిన పలు మార్పుల తర్వాత ఐసీసీ ఈ విధానాన్ని ‘డక్‌వర్త్‌ లూయి స్టెర్న్‌–డీఎల్‌ఎస్‌'గా మార్చింది. టోనీ లూయిస్‌ 2020లోనే మరణించారు. 2010లో డక్‌వర్త్, లూయిస్‌కు ప్రతిష్టాత్మక మెంబర్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటీష్‌ ఎంపైర్‌ (ఎంబీఈ) అవార్డు లభించింది. 

Famous Writer Arundhati Roy : పెన్‌ పింటర్‌ పురస్కార గ్రహీత అరుంధతీ రాయ్‌

#Tags