Nikesh Arora: ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!.. ఎవరీ నికేశ్‌ అరోరా

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్‌ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.

బ్రాడ్‌కామ్‌ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్‌ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్‌ అరోరా వేతనం 151.43 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.

Narayanan Vaghul: పద్మభూషణుడు, ప్రముఖ బ్యాంకర్‌.. వాఘుల్‌ గురించి తెలుసా..?

అత్యధిక వేతనం అందుకుంటుంది వీళ్లే..

అడోబ్‌కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్‌ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్‌ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 24.40 మిలియన్‌ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్‌లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్‌ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.

First Judge in California: అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. ఈమె ఎవ‌రో తెలుసా..

ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నికేశ్‌ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది.

#Tags