Mansukh Mandaviya: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవియా

కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవియా నియమితులయ్యారు.

ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన అనురాగ్‌ ఠాకూర్‌ స్థానంలో 52 ఏళ్ల మాండవియాకు అవకాశం దక్కింది.

గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 

మాండవియాకు తోడు మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేను క్రీడా శాఖ సహాయ మంత్రిగా కూడా నియమించారు. ఠాకూర్‌ క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 7 పతకాలు గెలుచుకుంది. 

Cabinet Ministers: మోదీ 3.0 టీమ్.. కేంద్ర కేబినేట్‌లో 72 మంది మంత్రులు వీరే..

#Tags