Software Company Director : సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్‌కు హాయోలో కీలక విధులు..
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె రామసహాయం రాధిక అమెరికాలోని కొలంబస్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా, రాధికను అమెరికాలో ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారని ఆమె తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు.
రాధికకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రఘురాంరెడ్డితో 2006లో వివాహం జరగగా, ఆయనతోపాటు అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి అంచెలంచలుగా కంపెనీలో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. 2009 నుంచి వివిధ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో రాధికకు ఈ అవకాశం వచ్చిందని బుచ్చిరెడ్డి తెలిపారు. 2026 వరకు అమె ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)