New Secretaries: ఈ శాఖలకు కొత్త కార్యదర్శులు.. వారెవ‌రంటే..

ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, మైనార్టీల సంక్షేమం తదితర శాఖలకు కొత్త కార్యదర్శులను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ఆగ‌స్టు 16వ తేదీ ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్‌ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. 

రాజేష్ కుమార్ సింగ్‌ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్‌ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్‌ అక్టోబరు 31వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు. 
 
పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా  నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆరోగ్య శాఖలో తొలుత ఆమె ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా చేరనున్నారు. ప్రస్తుత కార్యదర్శి అపూర్వ చంద్ర సెప్టెంబర్ 30వ తేదీ పదవీ విరమణ చేయ‌నున్నారు.

పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్‌.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్‌ బ్యూరోకాట్‌ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు.  ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి వివేక్‌ జోషి.. సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

TV Somanathan: కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శిగా టీవీ సోమ‌నాథ‌న్‌.. ఆయ‌న ఎవ‌రంటే..

#Tags