Andhra Pradesh Chief Secretary: నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ సమీర్ శర్మ సెప్టెంబర్ 30న వెలగపడిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్ స్థానంలో ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్ ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. సమీర్ శర్మ ఇప్పటివరకు రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
వీకేసీ అంబాసిడర్‌గా అమితాబ్
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్‌ను వీకేసీ పుట్‌వేర్ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. సంస్థ తర్వలో చేపట్టనున్న ‘‘సెలెబ్రేట్ హార్డ్ వర్క్’’ ప్రచార కార్యక్రమాన్ని అమితాబ్‌తో దేశమంతంటా ప్రారంభించనుంది.
చదవండి: వైమానిక దళం కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ఐఏఎస్ అధికారి డా.సమీర్ శర్మ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం, వెలగపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఇప్పటివరకు సీఎస్‌గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో...