Chief of Army Staff: దేశ 29వ సైనిక దళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
దేశ 29వ సైనిక దళాధిపతి(చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఏప్రిల్ 30న రిటైరవుతున్నారు. అదే రోజు పాండే బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ ఏప్రిల్ 18న ప్రకటించింది. దీంతో ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ డివిజన్ నుంచి ఈ పదవి చేపట్టనున్న తొలి సైన్యాధికారిగా పాండే రికార్డు సృష్టించారు.
Pink Lady: ఏ దేశానికి చెందిన న్యూస్ రీడర్ పింక్ లేడీగా పేరొందారు?
జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్‌వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు.
Pakistan New PM : పాక్ కొత్త ప్రధాని ఈయనే.. ఏకగ్రీవంగా ఎన్నిక
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశ 29వ సైనిక దళాధిపతి(చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ఎందుకు : ప్రస్తుత సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఏప్రిల్ 30న రిటైరవుతున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్