Movva Rama Rao: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వా మృతి

తెనాలికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వా రామారావు (89) అక్టోబర్ 29వ తేదీన తుది శ్వాస విడిచారు.

ఆయనకు భార్య రామలక్ష్మమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు ఆంజనేయప్రసాద్ త్వరలో రాగా, నవంబర్ 1న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

డాక్టర్ రామారావు తెనాలి సమీపంలోని వేమూరు మండలం జంపనిలో 1935 జూన్‌ 4న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయ‌న కొల్లూరులో ఉన్న హైస్కూల్లో చదివారు. తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో పీయూసీ పూర్తిచేశారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో ఏజీ బీఎస్సీ చేసిన అనంతరం, ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ)లో పీహెచ్‌డి పూర్తిచేశారు. ఆయన పీహెచ్‌డి డిగ్రీని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేత అందుకున్నారు.

Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త 'రతన్‌ టాటా' కన్నుమూత

రామారావు ఉద్యోగ చరిత్ర
వ్యవసాయ శాఖ: ఏజీ బీఎస్పీ పూర్తికాగానే, వ్యవసాయ శాఖలో డిమాన్‌స్ట్రేటర్‌గా మంగళగిరిలో చేరారు.
విశ్వవిద్యాలయం: హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యానశాఖ విభాగం అధిపతిగా పనిచేశారు.
తిరుపతిలోని అగ్రికల్చర్ కాలేజీ: ఆరేళ్లు ప్రిన్సిపాలుగా బాధ్యతలు నిర్వహించారు.

రామారావు.. మామిడితో పాటు టమాటా రకాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. టమాటాలో నూతన మెరుగైన రకాలను అభివృద్ధి చేశారు, వాటి ద్వారా విపరీతమైన పురోగతి సాధించారు.

John Amos: హాలీవుడ్ నటుడు జాన్ అమోస్ కన్నుమూత‌

#Tags