Delhi New CM: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన‌ అతిషి

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా నీరు, విద్యాశాఖ మంత్రి అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి పేరును ఆప్ పార్టీ ప్రకటించింది. ఆప్ ఎమ్మెల్యేలు ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీ ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆమె పేరును పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.  

కాగా.. ఇవాళ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. ఈ భేటీలో గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయనున్నారు.

Rajesh Verma: సీఏక్యూఎం ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రాజేష్ వర్మ

#Tags