Medical Devices Policy: మెడికల్‌ డివైసెస్‌ పాలసీకి కేంద్రం ఆమోదం

వైద్య పరికరాల తయారీ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం నేషనల్‌ మెడికల్‌ డివైసెస్‌ పాలసీకి ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్‌ మాండవీయ ప్రకటన ప్రకారం–ఆరు వ్యూహాలపై ఈ పాలసీ దృష్టిని సారించి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం 11 బిలియన్ యూఎస్‌ డాలర్ల టర్నోవర్‌ ఉన్న ఈ రంగాన్ని.. రానున్న ఐదేళ్లలో 50 బిలియన్ యూఎస్‌ డాలర్లకు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమన్నారు. దేశంలో వైద్య పరికరాలకు ఎంతో డిమాండ్‌ ఉందని, దేశీయంగానే తయారీని చేపడితే.. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడమే కాక.. విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags