Student Suicides: జనాభా వృద్దిరేటు కన్నా.. విద్యార్థుల ఆత్యహత్యలే ఎక్కువ.. తొలి మూడు రాష్ట్రాలు ఇవే!!

భారతదేశంలో జనాభా వృద్దిరేటు కన్నా విద్యార్థులు ఆత్యహత్యలే ఎక్కువ అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెల్ల‌డించిన నివేదిక ద్వారా తెలిసింది.

ఎన్‌సీఆర్‌బీ డేటా ఆధారంగా, ఇంటర్నెషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (IC3) కాన్ఫరెన్స్, ఎక్స్‌పో 2024లో ఆగ‌స్టు 28వ తేదీ సమర్పించిన "విద్యార్థుల ఆత్మహత్యలు: భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి(ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా)" నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి.

ఈ నివేదిక ప్రకారం.. మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2 శాతం పెరిగింది. 2021- 2022 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4 శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్‌ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. 

ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు!
దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే, విద్యార్థి ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు నాలుగు శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయని, పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం మగ విద్యార్థులే. అయితే, 2021-22 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి. కానీ ఇదే సమయంలో ఆడపిల్లల ఆత్మహత్యలు 7 శాతం పెరగడం గమనార్హం.

New Districts: ఈ రాష్ట్రంలో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు

తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే..
మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లు అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాలుగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్‌ రాజస్థాన్‌  రాష్ట్రం 10వ స్థానంలో ఉంది.  

అంతేకాదు కేసులు నమోదైన దాని ప్రకారం గుర్తించిన డేటా మాత్రమేనని, నమోదు కానీ కేసుల సంఖ్యకలిస్తే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆత్మహత్యాయత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. 

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం, సహాయం చేయడం నేరం.

Oral Cholera Vaccine: మరణాలు తగ్గించడానికి.. భార‌త్ బయో నుంచి ఓర‌ల్ క‌ల‌రా వ్యాక్సిన్

#Tags