Scheduled Caste : ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదా!

రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీహార్‌లో ఈబీసీ జాబితా నుంచి ‘తంతి– తంత్వ’ సామాజిక వర్గాన్ని తొలగించి.. షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో ఉన్న ‘సావాసి’లో కలుపుతూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

India's Growth : భారత వృద్ధి 7 శాతంగానే.. కార‌ణం!

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 ప్రకారం–ప్రచురించిన షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. క్లాజ్‌–1లో పొందుపరిచిన ఎస్సీ కులాల జాబితాను పార్లమెంటులో చట్టం ద్వారానే మార్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆర్టికల్‌ 341 ప్రకారం–పార్లమెంటులో చట్టం చేయకుండా ఈ జాబితాలో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి కూడా ఉండదని ధర్మాసనం తెలిపింది. 

#Tags