Robotic Elephant: దేవాలయంలో రోబోటిక్‌ ఏనుగు

ఆలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగులపై దేవదేవులను ఊరేగించడం సాంప్రదాయం. కొన్ని చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా ఏనుగులను ఊరేగించడం ఆనవాయితీ.

కేరళ, తమిళనాడులోని పలు ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పొందుతుంటారు. పలు క్షేత్రా­ల్లో ప్రత్యేకంగా ఏనుగులను పెంచుతూ ఉంటారు. అయితే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారి కట్టినతర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు పెడుతూ భక్తులపైకి వెళ్తూఉంటాయి. కొన్నిసార్లయితే శిక్షణ ఇచ్చిన మావటీలను చంపిన ఘటనలు చూస్తుంటాం. కేరళలోని త్రిసూర్‌లో ఉన్న ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన నదయిరుతాల్‌ వేడుకలో రోబోటిక్‌ ఏనుగును వినియోగిస్తున్నారు. ఈ రోబో ఎనుగు అంబారీ కట్టి భగవంతుని సేవలో పాల్గొన్నది. దీనిని సినీనటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా సభ్యులు ఆలయానికి అందజేశారు. నదయిరుతాల్‌ వేడుకల్లో ఏనుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా ఒక ఆలయంలో రోబో ఏనుగును ఉపయోగించడం ఇదే మొదటిసారి.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags