India Population: భారత్‌లో పెరగనున్న లింగ నిష్పత్తి

భారత‌దేశంలో లింగ నిష్పత్తి 2036 నాటికి మెరుగుపడనుంది.

ప్రతి వెయ్యి మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక, ప్రణాళిక అమలు శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000:943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 
 
2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత జనాభాలో మహిళ శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మరోవైపు ఇదేకాలంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.

PM Awaas Yojana: ఈ పథకం కింద గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు

#Tags