Smart India Hackathon: అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు.. ప్రధాని మోదీ

భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌(ఎస్‌ఐహెచ్‌)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ఫైనల్ పోటీదారులతో మాట్లాడారు.

‘నేటి యువత దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యతను భావిస్తున్నది. వారు వినూత్న ఆవిష్కరణలు, సాంకేతికత సత్తాతో ముందుకు సాగుతున్నారు. భారత యువత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు మార్గదర్శకంగా మారినది’ అని మోదీ అన్నారు.

ఏడో దఫా ఎస్‌ఐహెచ్ పోటీలో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కి పైగా విద్యార్థి బృందాలు ఫైనల్‌లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా, హార్డ్‌వేర్ ఎడిషన్ పోటీ 15వ తేదీ దాకా కొనసాగుతుంది.

Bima Sakhi Yojana: పది పాసైన మహిళలకు శుభ‌వార్త‌.. ‘బీమా సఖీ యోజన’ పథకం ప్రారంభం.. నెలకు రూ.7,000..

ఈ పోటీలో.. జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, పరిశ్రమలు ఇచ్చిన సమస్యలపై, విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను సమర్పించి వాటికి అత్యుత్తమ పరిష్కారాలను అందించాల్సి ఉంటుంది.

#Tags