Underwater Metro: కలకత్తాలో అండర్‌వాటర్‌ మెట్రో లైన్ ప్రారంభం

దేశంలోనే తొలి అండర్‌ వాటర్‌​ మెట్రో రైలు లైన్‌ను పశ్చిమబెంగాల్‌ రాజధాని కలకత్తాలో మార్చి 6వ తేదీ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ప్రారంభించారు.

కొత్త లైన్‌పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు.  

అండర్‌ వాటర్‌ మెట్రోతో పాటు మొత్తం రూ.15 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలకత్తాలోని హౌరామైదాన్‌-ఎస్ప్లాండే సెక్షన్‌లోని 4.8 కిలోమీటర్ల మెట్రో ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌లో హూగ్లీ నదిపై అండర్‌వాటర్‌ మెట్రోను నిర్మించారు.

భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్‌ స్టేషన్‌ ఉంటుంది. ఈ కారిడార్‌ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్‌ సాల్ట్‌ లేక్‌ సెక్టార్‌తో అనుసంధానిస్తుంది. ఈ కారిడార్‌ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్దిరోజుల తర్వాత అండర్‌ వాటర్‌ ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Underwater Metro: నీటి అడుగున నడ‌వ‌నున్న‌ మెట్రో రైలు.. దీని విశేషాలు ఇవే..

#Tags