World Tourism Day: కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన పోర్టల్‌ పేరు?

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 27న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర పర్యాటక శాఖ ‘టూరిజం ఫర్‌ ఇంక్లూజివ్‌ గ్రోత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొనగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్, పర్యాటక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కమలవర్ధన్‌ రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ పర్యాటక గణాంకాలతో రూపొందించిన ‘నిధి 2.0’ (ద నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పోర్టల్‌ను స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించారు. పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే చర్యల్లో భాగంగా... దేశంలోని పర్యాటక ప్రాంతాలు, హోటల్స్, డెస్టినేషన్స్, వాతావరణ పరిస్థితులు, సౌకర్యాల వివరాలతో నిధి పోర్టల్‌ను రూపొందించామని మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

చ‌ద‌వండి: కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఉద్దేశం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నిధి 2.0 (ద నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పోర్టల్‌ ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
ఎక్కడ    : అశోకా హోటల్, న్యూఢిల్లీ
ఎందుకు : పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే చర్యల్లో భాగంగా...

#Tags