Child Marriages: బాల్య వివాహాల్లో ముందున్న కర్ణాటక

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ఆగ‌స్టు 2వ తేదీ అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు రాష్ట్రాల‌ను లోక్‌సభలో వెల్లడించారు.

బాల్య వివాహాల్లో కర్ణాటక రాష్ట్రం మొద‌ట ఉండ‌గా.. త‌ర్వాత స్థానాల్లో అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఉన్నాయ‌న్నారు. 2022లో దేశంలో 1002 బాల్య వివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని నిరోధించేందుకు చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. 

ఏపీలో కేవలం 26 బాల్య వివాహాలు..
ఏపీలో 2022లో కేవలం 26 బాల్య వివాహాలు నమోదయ్యాయని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా బాల్య వివాహాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంది. రక్తహీనత సమస్యను అధిగమిస్తే బాల్యవివాహాలను నివారించడం సాధ్యమనే లక్ష్యంగా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాల్యవివాహాలు చేసే అవకాశం ఉన్న వారికి ముందుగానే గుర్తించి, నివారించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది.

Child Marriage: భారతదేశంలో తగ్గిన బాల్య వివాహాలు

2022లో వివ‌ధ‌ రాష్ట్రాల్లో న‌మోదైన‌ బాల్య వివాహాలు..
కర్ణాటక - 215
అసోం - 163
తమిళనాడు - 155
పశ్చిమ బెంగాల్ - 121
మహారాష్ట్ర - 99
తెలంగాణ - 53
పంజాబ్ - 46
హ‌రియాణ - 37
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - 26

#Tags