Arms Production : రికార్డు స్థాయిలో దేశీయ ఆయుధాల ఉత్పత్తి!

భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం అనేక కొత్త మైలురాళ్లను అధిగమించిందన్నారు. 2022–23లో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ రూ.1,08,684 కోట్లుగా ఉండేదని చెప్పారు. 2023–24లో 16.8 శాతం వృద్ధితో అది దాదాపు రూ.1.27 లక్షల కోట్లకు చేరిందన్నారు.

Reservation for Ex Agniveer : మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు

మన సామర్థ్యాలను మరింత మెరుగుపరచుకొని.. భారత్‌ను అంతర్జాతీయ ఆయుధ ఉత్పత్తి హబ్‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల మన భద్రతా వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. దీంతోపాటు స్వయం సమృద్ధి సాధించడానికి వీలవుతుందని తెలిపారు.

#Tags