Medicines Ban: 156 ఔషధాలను నిషేధించిన‌ కేంద్రం.. వాటిలో ఈ మందులు కూడా..

రోగుల ఆరోగ్యానికి హాని కలిగంచే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషనల్‌ను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది.

ఈ 156 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. డ్రగ్ టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 

MonkeyPox Cases: 'మంకీపాక్స్‌'పై WHO హెచ్చరిక.. అప్రమత్తమైన కేంద్రం

ఆగస్ట్ 12వ తేదీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ+ పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్+ ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌' వంటివి ఉన్నాయి.

#Tags