Minimum Support Prices: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో క్వింటాల్‌ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. 

ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచారు. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది.  

వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది.  

ఏ పంట‌ల‌కు ఎంతంటే(క్వింటాల్‌కు రూ.ల‌లో)

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు ఇవే.. 
➤ మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ డీప్‌ డ్రాఫ్ట్‌ మేజర్‌ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్‌–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్‌ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్‌ పొడవు వెయ్యి మీటర్లు.  

➤ రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు.
 
➤ సముద్ర తీరంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్‌లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్‌ ప్రాజెక్టుల అమలు.  

➤ 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్‌ఎఫ్‌ఐఈఎస్‌) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఏర్పాటు. 

Onion Exports: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత..!

#Tags