Garba dance: యునెస్కో జాబితాలో గర్బా నృత్యానికి చోటు

గుజరాత్‌కు చెందిన ప్రముఖ గర్బా నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్)జాబితాలో చేర్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు.
Garba dance enters UNESCO’s list of intangible cultural heritage

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారతదేశం నామినేట్ చేసింది. గర్బా  అనేది ఒక నృత్య రూపకంగా ప్రాచుర్యం పొంది, సంప్రదాయాన్ని కలబోస్తూ, అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేదిగా నిలుస్తున్నదని యునెస్కో పేర్కొంది.

Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్‌ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ

#Tags