Assembly Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 99 మందితో భాజపా మొదటి జాబితా
వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది.
ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు.
జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
Nayab Singh Saini: హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం