Assembly Elections 2023 : ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుద‌ల‌.. 2023లో ఈ 9 రాష్ట్రాల‌కు..

దేశంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది.

ఈ మేరకు జ‌న‌వ‌రి 18వ తేదీన (బుధవారం) పాత్రికేయ సమావేశం నిర్వహించి.. ఈ వివరాలను వెల్లడించారు సీఈసీ రాజీవ్‌ కుమార్‌. మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు.

➤ AP Voters: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ... మొత్తం ఓటర్లు 4 కోట్లు... పూర్తి వివరాలు.... ఇవిగో

నాగాలాండ్‌లో..
మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు మార్చి 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,09,651 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా, జనరల్‌ కేటగిరీ ఒక్క స్థానానికే ఉంది.

➤ How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..

మేఘాలయాలో..

12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి మార్చి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 21,61,129 ఓటర్లు ఉన్నారు అక్కడ. 55 స్థానాలు ఎస్టీ, జనరల్‌ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

➤ Voter Card Application : ఈసీ కీలక నిర్ణయం.. 17 ఏళ్లకే ఓటర్‌ కార్డు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.. కానీ..

త్రిపురలో..
ఎనిమిది జిల్లాలు.. 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి మార్చి 22వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ 30 జనరల్‌, ఎస్సీ 10, ఎస్టీ 20 స్థానాలు ఉన్నాయి.

➤ Voter Registration: ఆధార్ తప్పనిసరి కాదు
ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాజపా అధికారంలో ఉంది. త్రిపురలో మాణిక్‌ సాహా నేతృత్వంలోని భాజపా సర్కారు ఉండగా.. మేఘాలయ, నాగాలాండ్‌లో కాషాయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.

2023లో 9 రాష్ట్రాల‌కు..

ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ తర్వాత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాలు ఈ ఏడాదిలోనే ముగియనున్నాయి.

#Tags